గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల పరిధిలోని కౌలూరు అటవీ ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై ఆదివారం కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. గుడుంబాను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని, పట్టుబడిన 3000 లీటర్ల గుడుంబాను నేలమట్టం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… ప్రభుత్వ నిషేధిత నాటు సారా తయారు చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అని, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరమన్నారు.కానీ కొంతమంది ప్రభుత్వం పాలసీకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో రహస్యంగా ఇండ్లు, పంట పొలాల వద్ద, అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా కలుషిత నాటుసారా తయారు చేస్తున్నారన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో వారిని కూడా పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram