గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : చెరువులో దిగిన తండ్రిని కాపాడబోయి కుమారుడూ ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలోని బోనకల్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.. స్థానికుల తెలిపిన వివరాల బోనకల్ మండల పరిధిలోని ఆలపాడు గ్రామానికి చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్ స్థానికంగా ఉన్న ఊర చెరువులోకి దిగారు. కాసేపటికే యూసుఫ్ ఖాన్ పట్టుకోల్పోయి నీటిలో మునిగిపోయారు. అది గమనించిన అతడి కుమారుడు పఠాన్ కరిముల్లా ఖాన్.. తండ్రిని కాపాడేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో తండ్రితో పాటు కుమారుడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ పండగ రోజునే తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Post Views: 54









