రైతుబజార్ ప్రారంభిస్తున్న మంత్రి ..తుమ్మల నాగేశ్వరరావు

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం :  రైతులు కూరగాయలు నేరుగా విక్రయించేందుకు రైతు బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రం పక్కన రైతుబజార్  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మున్సిపల్ సాధారణ నిధులు రూ.58.50 లక్షలతో రైతుబజార్ను పునర్ నిర్మించామన్నారు. కూరగాయలు పండించే పేద రైతులు స్వయంగా సరకును  విక్రయించేందుకు సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కలెక్టర్ ముజమ్మిలాఖాన్ మాట్లాడుతూ.. గాంధీచౌక్లో రూ.30 లక్షలతో మరో మార్కెట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram