మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ దురదృష్టకరం

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్‌ రావు అక్రమ అరెస్టును కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావు సోమయ్య గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం తగదని, ఇప్పటికైనా ఇలాంటి కక్షసాధింపు చర్యలను వెంటనే మానుకోవాలన్నారు. బహిరంగ చర్చకు సవాళ్లు విసిరింది కాంగ్రెస్ నాయకులేనని, తాము చర్చకు సిద్ధమని ముందే ప్రకటించినప్పటికీ, వెనకడుగు వేసి పోలీసులతో అరెస్టులకు పాల్పడడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు సర్పంచులు మరియు ఉప సర్పంచ్ పాల్గొన్న జరిగింది

 

Facebook
WhatsApp
Twitter
Telegram