15 ఏళ్లు సహ జీవనం ద్వారా కలిసి, ఒక బిడ్డను కన్నా తరువాత ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా సహజీవన భాగస్వామిని కోర్టులు ఏమీ చేయలేవని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 15 సంవత్సరాల సహ జీవనం లో ఒక బిడ్డ కూడా కలిగాడని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటానని వెళ్లిపోయాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కింద కోర్టులు అనుకూలంగా తీర్పు ఇవ్వక పోవడంతో సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. పెళ్ళికి ఉన్న చట్టబద్దత, సహజీవనానికి ఉండదు, అందువల్ల సహజీవన భాగస్వామి వెళ్ళిపోతే, కోర్టు మీ పట్ల సానుభూతి తెలుపగలదు. అంతే , అంతకు మించి ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. సహజీవనం నేరం కాదు, అలాగని చట్టబద్ధమైన హక్కులు కలిగిన బంధం కాదు. ఇష్ట ప్రకారమే కలుస్తారు ఇష్టం లేనప్పుడు విడిపోతారు.. అంతే.. అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
Post Views: 14








