మణుగూరు ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్స్ కు మధ్య కుదిరిన ఒప్పందం.

గోల్డెన్ న్యూస్ /మణుగూరు/ డ్రైవర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 30.6.2026 నుండి సమ్మె చేయగా !

ఈ రోజు అనగా 1.7.2026 న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) ఆధ్వర్యంలో ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్స్ యూనియన్ నాయకులకు మధ్య జరిగిన చర్చల్లో వేతనాలు పెంచుతూ ఒప్పందం చేసుకోవడం జరిగింది.

 

ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం..

 

పాత జీతం రోజుకు 500 ఉండగా 100 రూపాయలు పెంచుకొని రోజుకు 600 గా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం.1.7.2026 నుండి 30.6 2028 వరకు అమలులో ఉంటుంది. దీనితో పాటు విధివిధానాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ చర్చల్లో ట్రాక్టర్ యజమానుల ప్రతినిధులు ఉడతనేని. రవి, చింతల. అశోక్, వెంకటసోములు, శివ, నరసింహారావు, డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కోండ్రు. శీను, కోర్స. సమ్మయ్య, మడకం. లక్ష్మయ్య, గట్టుపల్లి. రమేష్, సవలం. లక్ష్మయ్య, మడకం. రాంబాబు, గట్టుపల్లి. భద్రయ్య, మహేష్, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం. వెంకన్న పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram