గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐఏడబ్ల్యూయూ , సీఐటీయూ , ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నాయకులు కరకగూడెం మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు రైతు సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ పద్దం గణేష్ లు మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలను పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రైతులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి అనుకూలంగా తక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ, ఏఐకేఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.








