VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్ర్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (VB-GRAMG) పథకం బుధవారం (జూలై 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం పాత _MGNREGA స్థానంలో అమలులోకి వచ్చి, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, ఆదాయ భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

పథకంలోని ముఖ్యాంశాలు:

 

‣గ్రామీణ కార్మికులకు రోజువారీ కనీస వేతనం రూ.300గా నిర్ణయం.

 

» దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి సుమారు రూ.327కు పెంపు.» దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి సుమారు రూ.327కు పెంపు.

 

ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.28 అదనపు లభించనుంది. ఆదాయం

 

» ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు.

 

» ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వేతనాలు 15-25 శాతం వరకు పెరిగాయి.

 

 

» ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వేతనాలు 15-25 శాతం వరకు పెరిగాయి.

 

▸ఇప్పటికే అధిక వేతనాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా సవరణలు చేశారు. హర్యానా రూ .406, గోవా.409, కేరళ రూ.401 రోజువారీ వేతనంగా నిర్ణయించారు.

 

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేతనాలను ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI) తదితర ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు స్థానిక మార్కెట్లలో డిమాండ్ను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కేంద్ర  ప్రభుత్వం భావిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram