నగ్న ఫొటోలు బయట పెడతామని డబ్బు డిమాండ్.
కామారెడ్డిలో ముఠా ఆగడాలు.
గోల్డెన్ న్యూస్/ కామారెడ్డి : పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే వారిని లక్ష్యంగా చేసుకుని కామారెడ్డిలోని ముఠా బెదిరింపులకు పాల్పడి డబ్బులు దండుకుంటోంది. తొలుత ఈ ముఠా సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా వల విసురుతున్నారు. స్పందించిన వారిని కామారెడ్డి పట్టణానికి రప్పిస్తున్నారు. ప్రైవేటుగా కలిసేసమయంలో వారి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. తర్వాత అవి బయట పెడతామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. వేధింపులు తాళలేక పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఠా సభ్యులు కామారెడ్డిలో ఒక డెన్ను ఏర్పాటు చేసుకున్నారు.
గ్యాంగులోని ఐదుగురు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ తోపాటు పలు చోట్ల రెండు నెలల వ్యవధిలోనే ఇలాంటివి 9 కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా మంది పరువు పోతుందనే భయంతో కేసులు పెట్టడానికి ముందుకు రావట్లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితులకు చేసిన ఆన్లైన్ చెల్లింపుల ఆధారంగా బాధితులు 40 నుంచి 50 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బాధితులు కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వేధింపులు తాళలేక గతంలో నిజామాబాద్కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులు కేసులు పెట్టడానికి ధైర్యంగా ముందుకు రావాలని వా రి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలిపారు.









