రూ.15 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ ఏసీబీకి చిక్కారు
సిద్దిపేట : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్్యండెడ్గా పట్టుబడ్డారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏసీబీ వివరాల ప్రకారం.. జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి. అరుణ (AO-1), అదే గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ (AO-2)లు ఫిర్యాదుదారుడి నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదుదారుడి పేరుపై ఉన్న రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తు ఫైలును ముందుకు పంపించి, ప్రాసెస్ చేయడం కోసం మొదట పంచాయతీ కార్యదర్శి రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం తగ్గించినట్లు పేర్కొంది. మొత్తాన్ని రూ.15,000కు
ఈ క్రమంలో అక్టోబర్ 6, 2026న ఉదయ: సుమారు 11 గంటల సమయంలో జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ ద్వారా రూ.15,000 లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బి. అరుణ, కారోబార్ సంతోష్ ఇద్దరూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అనంతరం సంతోష్ వద్ద నుంచి రూ.15,000కి తగ్గించినట్లు పేర్కొంది లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విధులను నిబంధనలకు విరుద్ధంగా, నిజాయితీగా కాకుండా నిర్వహిస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.








