లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్

గోల్డెన్ న్యూస్ / నల్గొండ : నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గుగులోతు కృష్ణ.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. మండలంలోని గుండ్రంపల్లిలోని ఓ వ్యవసాయ భూమి మ్యూటేషన్, మరోచోట భూమి సర్వే కోసం రైతు వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాం చేశాడు. రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.2 లక్షలు కంప్యూటర్ ఆపరేటర్ రమేశ్ కు ఇవ్వమని చెప్పాడు.. అనిషా అధికారులు అవలవేసి పట్టుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram