భర్త వేధింపులు తాళలేక గర్భిణి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి : భర్త వేధింపులు తాళలేక గర్భిణి ఆత్మహత్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.అదనపు కట్నం కోసం వేధించడంతో భద్రాద్రి జిల్లా లచ్చగూడెంకు చెందిన 19 ఏళ్ల అంజలి (మూడు నెలల గర్భిణి) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సాయికుమార్ సెల్ఫోన్ లాక్కోవడం, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు బిగించి పుట్టింటికి వెళ్లనివ్వకపోవడం వంటి వేధింపులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram