గోల్డెన్ న్యూస్ /నాగర్ కర్నూల్ : తెలుగురాష్ట్రాల యువత కొంతకాలంగా మత్తుకి బానిసలుగా మారడం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ యువకుడు గంజాయి మత్తుకు బానిసైన ఎవరికి తెలియకుండా ఇంట్లోనే రహస్యంగా గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, పల్కపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పల్కపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగనులు మధు గంజాయికి బానిసయ్యాడు. గంజాయి కొనడానికి ప్రతిసారి బయటికి వెళ్లడం వెళ్లిన ప్రతిసారి పోలీసులకి భయపడుతూ కొనుగోలు చెయ్యడం ఎందుకు అనుకున్నాడు ఏమో. ఏకంగా గంజాయి విత్తనాలు సేకరించి ఇంట్లోనే సులభంగా పెంచుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలోకి తెచుకొచ్చాడు గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈ నోటా పడి వ్యవహారం పోలీసులు దాకా వెళ్ళింది వెంటనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు ఇంట్లో గంజాయి మొక్కను గుర్తించి నిందితుడు నాగనుల మధు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 









