రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరార్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన విజయవాడకు చెందిన యువతి సంబంధం యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న వరుడు..
మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలతో పరారైన ఘటన మండలంలో వెలుగులోకి వచ్చింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడికి యువతి పరిచయమైంది. గత అక్టోబరు నెలాఖరులో వీరు పెళ్లి చేసుకొన్నారు. అనంతరం హనుమకొండలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారం రోజుల కిందట పెళ్లి సందర్భంగా పెట్టిన బంగారం, ఇంట్లో భద్రపరిచిన నగదుతో మహిళ పరారైనట్లు సమాచారం. ఆమె గతంలోనూ పలు వివాహాలు చేసుకొని నగలు, డబ్బులతో ఉడాయిస్తూ మోసాలకు పాల్పడిందని, 13ఏళ్ల కుమార్తె ఉన్నప్పటికి తనకు పెళ్లి కాలేదని మోసం చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో పచారం సాగుతోంది. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు…









