ఆయుధాలు వదిలేస్తాం.. మావోయిస్టులు సంచలన ప్రకటన

పోరాటానికి ముగింపు.?

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ఈ మేరకు లేఖను విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ చెప్పింది. దీంతో ఈ లేఖపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయో చూడాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram