మండల స్థాయి అధికారులకు కలెక్టర్ ప్రత్యేకంగా సత్కారం
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : కరకగూడెం గ్రామపంచాయతీకి బెస్ట్ పంచాయతీ అవార్డు దక్కింది. జల్ సంచాయి జన్ భాగీదారీ కార్యక్రమం అమలులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీలక భూమిక పోషించింది. జాతీయస్థాయి అవార్డును దక్కించుకుంది. జిల్లా అధికారుల సమష్టి కృషి ఫలితంగానే జిల్లాకు అరుదైన గౌరవం దక్కిందని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కరకగూడెం గ్రామపంచాయతీకి ఉత్తమ పంచాయతీ అవార్డు లభించడం విశేషం. మండలంలో అత్యుత్తమంగా పనిచేసిన మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు.
Post Views: 71









