ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : అన్నారం ఇసుక ర్యాంపు వద్ద  మంగళవారం తీవ్ర ఉద్రిక్తత  నెలకొంది. ఇసుక ర్యాంపులోని లారీలకు పట్టాలు కట్టే విషయంలో అన్నారం గ్రామానికి చెందిన గిరిజనేతరులకు గిరిజనుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అన్నారం ఇసుక ర్యాంపును గ్రామ సభ్యులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాలుగా గిరిజనులు లారీలకు పట్టాలు కడుతుండగా గిరిజనేతరులు వచ్చి తమకు కూడా ఉపాధి కల్పించాలంటూ సొసైటీ సభ్యులపై వివాదాలకు దిగారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు లారీలకు రాకపోకలకు అనుమతి ఇవ్వరాదని స్పష్టంచేశారు. ర్యాంపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఈ పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram