గోల్డెన్ న్యూస్ /వేములవాడ : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. వేములవాడలోని రెండు పడకల ఇండ్లను శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కుంగిన ఫ్లోరింగ్.. తప్పిన ప్రమాదం
అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల నాణ్యతను ఈ సంఘటన ప్రశ్నార్థం చేసింది.
అప్పట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు సరిపడ డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక మంది కాంట్రాక్టర్లు పనుల మధ్యలోనే తప్పుకున్నారు.
మెజార్టీ ప్రాంతాల్లో టెండర్లు కూడా వేయడలేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం నష్టాలను తగ్గించుకునేందుకు నాసిరకం నిర్మాణాలు చేసి చేతులు దులుపుకున్నారు.
Post Views: 48









