పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం  :మండలంలో  కరకగూడెం  ఎస్‌ఐ పీవీఎన్ రావ్ , పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రహదారులకు మర మ్మతులు కార్యక్రమాన్ని మంగళ వారం చేపట్టారు. ప్రమాదక రంగా మారిన మండలంలోని పద్మాపురం సమీపాన గల కల్వర్ట్ ప్రాంతంలో బాగా దెబ్బ తిన్న రహ దారిలో  మరమ్మత్తులను చేపట్టారు. పలు పర్యాయాలు దెబ్బతిన్న ఈ కల్వర్టు వద్ద పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్వచ్ఛందంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతులు చేపట్టడంపై పలువురు పోలీస్‌ శాఖను అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమాలను చేపట్టడం పట్ల  వాహనదారులు, ప్రజలు పోలీస్‌ శాఖను ప్రశంసిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram