గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 2025 నోటిఫికేషన న్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 3 విడుదలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్ట చేశారు.
Post Views: 47









