విద్యుదాఘాతంతో మహిళ మృతి

గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మంగళవారం  ఉదయం  విద్యుతాఘాతానికిగురై మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బూర్గంపాడు మండలం పినపాక  పట్టినగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. రోజులాగే మంగళవారం ఉదయం యథావిధిగా వ్యాపార నిమిత్తం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు మెష్ డోర్ పట్టుకోగా ఆ డోర్ కు ఏర్పాటు చేసిన విద్యుత్ బలుపు విద్యుత్ తీగ పాడవడం వల్ల విద్యుత్ ప్రసరించి అక్కడికక్కడే మృతిచెందింది.

Facebook
WhatsApp
Twitter
Telegram