అంగన్వాడీ టీచర్ ఉరి వేసుకొని ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు/ బూర్గంపాడు మండల పరిధిలోని కోయగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ బింగి కృష్ణవేణి (42) సోమవారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం  కృష్ణవేణికి, ఆమె భర్తకు మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తి, గొడవలు జరుగు తున్నట్లు తెలుస్తున్నది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు జరుపుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram