బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్

బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్

ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్‌ల దుష్ప్రచారం తగదు

ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలని ఇస్తున్నాము

అయినా కలర్ బాగాలేదని, డిజైన్ బాగాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు 

 

సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్ హరీష్ రావులది

 

ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతుంటే అవి వారి కళ్ళకు కనిపించడం లేదు.. వారు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు

 

బీఆర్ఎస్‌లాగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదు..సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలు.. కావాలంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడగవచ్చు

 

కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలని అవమానించేలా ఉన్నాయి

 

చీరల్ని కొందరికే, మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నాము

 

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదు. ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని, కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. 

 

బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిది.. మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం సంతోషించడం నేర్చుకోండి

Facebook
WhatsApp
Twitter
Telegram