ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్ .
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్సైగా పని చేస్తున్న భానుప్రకాష్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఎస్సై చేసిన అక్రమాలు పోలీసు శాఖ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చే విధంగా ఉన్నాయి. క్రైమ్ కేసులను ఛేదించాల్సిన ఎస్సై.. తాను దర్యాప్తు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును కాజేయడమే కాకుండా.. ప్రభుత్వం కేటాయించిన 9MM రివాల్వర్‌ను సైతం అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఎస్సైకి కేటాయించిన కీలకమైన సర్వీస్ పిస్టల్ కనిపించకుండా పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. 2018 నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – రాయచోటికి చెందిన భాను ప్రకాష్.. అంబర్‌పేట్ పీఎస్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహణ . ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని కోరిన భాను ప్రకాష్.. వెపన్ డిపాజిట్ కోరడంతో బయటపడ్డ ఉదంతం . ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టిన భాను ప్రకాష్ . లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పిన ఎస్ఐ.
దీంతో విచారించి ఆ దుకాణం నుండి బంగారాన్ని రికవరీ చేసి, భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు
2018 నుండి బెట్టింగ్‌లకు అలవాటై భాను ప్రకాష్ రూ.కోటిన్నర పోగొట్టినట్లు, ఈ క్రమంలోనే సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టినట్లు తెలిపిన పోలీసులు.









