మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

గోల్డెన్ న్యూస్ /మణుగూరు : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో వారిచే మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల దగ్గరకు బస్సును . ధి.30.11.25.న ఆదివారం నాడు ఉదయం 6:30 కి మరియు 12:30 కి ఏర్పాటు చేయడం జరిగింది. అని డిపో మేనేజర్ కె శ్యాంసుందర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు అశ్వాపురం పినపాక కరకగూడెం మండలాల ప్రజలు మరియు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వనదేవతలను దర్శించుకోవచ్చని తెలియజేసినారు .ఈ విధంగా ప్రతి ఆదివారం నాడు జాతరకు ప్రత్యేక బస్సులను భక్తుల కోరిక మేరకు అదనంగా కూడా నడపడం జరుగుతుందని తెలిపినారు మరిన్ని వివరాలకు 9490553145

Facebook
WhatsApp
Twitter
Telegram