ట్రాన్స్ ఫార్మర్ల కీలక పరికరాలు ఎత్తుకెళ్లిన దుండగులు

కన్నేశారా చోరీ చేయాల్సిందే. కటిక చీకట్లలోనూ కాపర్ కొట్టేయాల్సిందే. కాదూ కూడదంటే విద్యుత్ వైర్లనయినా దిగమింగేయాల్సిందే. ప్రాణాంతకమని తెలిసినా విద్యుత్ వైర్లతో సయ్యాట లాడతారు. అర్ధరాత్రి మొదలు కోడి కూసే లోపు గప్ చుప్తాగా ఎత్తుకుపోతారు.

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలో కాపర్ దొంగలు రెచ్చిపోతున్నారు. బుధవారం రాత్రి  రేగళ్ళ గ్రామం పరిధిలోని మధులగూడెం గ్రామ శివారులోని కొమరం సూరి పామయిల తోటలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్లను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో  వ్యవసాయ  బోర్ల వద్ద విద్యుత్ కోసం అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి  వైర్లను వైట్ లైన్ ఎత్తు కలవడం లాంటి ఘటనలు మండలంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram