మూడు రోజులుగా తల్లి సమాధి వద్దే యువతి

గోల్డెన్ న్యూస్/ కరీంనగర్ / అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అమ్మ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. కని, పెంచిన అమ్మ కళ్ల ముందే విగతజీవిగా పడి ఉంటే.. పిల్లల అనుభవించే మనో వేదనను వర్ణించలేము. ప్రపంచమంతా అంధకారంతో నిండిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఓ యువతికి వచ్చింది. తల్లి దూరమైన తర్వాత ఆమె గుండె ముక్కలైంది. ఇక అమ్మ లేదు అనే నిజాన్ని జీర్నించుకోలేని ఓ కూతురు.. ఎవరూ చేయలేదని సాహసం చేసింది. శ్మశానంలో తల్లి సమాధి వద్దే మూడు రోజుగా నిద్రిస్తోంది. కరీంనగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నగరంలోని అజ్మత్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న హసీనా అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఇటీవల ఆమె చనిపోయింది. స్థానికంగా ఉన్న సవరన్ షీట్ కబరస్థాన్‌‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమార్తె ఆఫ్రిన్‌ తీవ్ర మనోవేదనకు గురైంది. అంత్యక్రియల సమయంలో కన్నీరుమున్నీరుగా విలపించింది. అంత్యక్రియల తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోయినా.. ఆఫ్రిన్ మాత్రం తల్లి సమాధి వద్దే కూర్చుని ఏడ్చింది.

 

కొద్ది సేపు తర్వాత అఫ్రిన్ ఇంటికి వస్తుందని అంతా భావించారు. కానీ ఆమె రాత్రంతా తల్లి సమాధి వద్దే ఉంది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు బలవంతంగా తీసుకెళ్లినా.. ఆమె మళ్లీ సమాధి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది అఫ్రిన్. ఇలా మూడు రోజులుగా శ్మశానంలోనే గడుపుతోంది. రాత్రివేళల్లో కూడా శ్మశానంలో ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఆఫ్రిన్ తండ్రి, మరికొందరు బంధువులు ఆమెను ఎంతగా ఒప్పించినా యువతి సమాధిని వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.

 

ఇదే విషయంపై స్పందించిన షీ టీమ్స్, సఖి టీం, మరియు మహిళా సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని యువతిని కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వైద్య సహాయం అందించడానికి చర్యలు ప్రారంభించారు.

 

సమాజ సేవకులు, మానవతావాదులు యువతికి మానసిక ఆరోగ్య చికిత్స మరియు సురక్షిత పర్యవేక్షణ అత్యవసరమని సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram