కొత్తగూడెంలో బాంబు కలకలం

రైల్వే స్టేటన్ సమీపంలో బాంబు పేలి కుక్క మృతి

 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గరలోని రైలు పట్టాల మీద నాటు  బాంబు కలకలం కుక్క తినే పదార్థం అని బాంబు ని కొరకడంతో  మృతి చెందిన కుక్క ఘటన.

బుధవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గరలోని రైలు పట్టాల మీద నాటు బాంబుని కుక్క తినే పదార్థం  అనుకొని కొరికింది. బాంబు పేలడం తో కుక్క నోరు నుజు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది.

 

రైల్వే ట్రాక్ పై బాంబులు ఎవరు పెట్టారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ వద్ద బాంబును ఎవరు పెట్టారు అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెం నల్లిబొడ్డులోని రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Facebook
WhatsApp
Twitter
Telegram