దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్.
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / కొందరు సిబ్బంది తీరుతో పోలీస్ శాఖకు మచ్చ వస్తోంది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు చోరీలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ కానిస్టేబుల్ రోలెక్స్ వాచ్ కొట్టేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి ఠాణాలో నుంచి ఫోన్ దొంగతనం చేశాడు.
పోలీస్ స్టేషన్లో దొంగతనం.
హైదరాబాద్ – మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోను పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి
సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, ఫోన్ రికవరీ చేసి, లాకర్లో దాచిపెట్టిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది దాని విలువ రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో దానిపై కన్నేసి, కొట్టేసిన పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్
శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించి, అతన్ని రిమాండుకు తరలించిన ఉన్నతాధికారులు..









