గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలోని వట్టం వారి గుంపు పంచాయతీ, కరకగూడెం పంచాయతీ, భట్టుపల్లి పంచాయి నుండి వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సభ్యులు మొత్తం 30 కుటుంబాలు ఆదివారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
Post Views: 69









