పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

 గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి /  మణుగూరు జడ్పీ హైస్కూల్ ల్లో నిర్వహిస్తున్న స్థానిక  ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై ఆయన సమీక్ష చేపట్టారు.

అధికారులు, సిబ్బంది ఎలాంటి విఘాతం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram