గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గురువారం మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పరిశీలించారు . ఈ సందర్భంగా డి.ఎస్.పి అధికారులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ పాల్గొన్నారు.
Post Views: 66









