ఆసుపత్రి తనిఖీ చేసిన డీఎంహెచ్వో

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం /  జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గురువారం  పాల్వంచలోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 

తనిఖీలో భాగంగా ఆయ‌న ఆస్పత్రి వర్గాలకు సూచనలు చేశారు అనంతరం ఆయా ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్ లో మందుల లభ్యత, రికార్డులు తనిఖీ చేశారు.

 

ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల ప్రైస్ లిస్ట్ ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు.

 

ల్యాబ్‌లో నిర్వహించే రక్తపరీక్షల ధరల జాబితా కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలన్నారు.

 

ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లను కూడా స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.

 

వాడే వైల్స్ మూత తొలగించిన వెంటనే, వాటిపై తేదీ మరియు సమయం తప్పనిసరిగా నమోదు చేయాలి.

 

కాన్పులు నిర్వహించే గదులను శుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైన మందులను తగిన విధంగా నిల్వ చేయాలని తెలిపారు.

 

ఆసుపత్రి నిర్వహణలో కనుగొన్న అసమానతలు మరల పునరావృతం కాకూడదని జిల్లా వైద్యాధికారి తుకారం రాథోడ్ హెచ్చరించారు.

ఈ  కార్యక్రమంలోDy .pmo మోహన్ పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram