నూతన సర్పంచులను సన్మానించిన మంత్రి

 గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం/ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులను గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సన్మానించారు. కరకగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వంలో వారిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, గోగ్గలి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram