దారుణ ఘటన.. భార్య గొంతు కోసిన భర్త!

గోల్డెన్ న్యూస్ /హన్మకొండ /  ఆత్మకూరులో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. దంపతుల మధ్య తరచూ జరుగుతున్న కుటుంబ కలహాలు చివరకు హింసాత్మక ఘటనకు దారి తీశాయి. భర్త భార్య అనూషపై కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అనూషను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, అదే కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.వివాహేతర సంబంధం కారణంగానే భర్త ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram