ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

గోల్డెన్ న్యూస్ /నంద్యాల / నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రదహదారి 40పై ఆళ్లగడ్డ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్‌లో వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఆళ్లగడ్డ మండలం బత్తలూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు–క్వాలీస్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్వాలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

 

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram