పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి కూతురి హత్య చేసిన తల్లిదండ్రులు

 రాష్ట్రంలో మరో పరువు హత్య

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / కూతురు ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వద్దని చెప్పినా వినలేదు. అతనితో ఉంటానని చెప్పింది కూతురు. తమ పరువు సమస్యగా భావించి.. కూతురును ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు పేరెంట్స్. ఆ వివరాలు ఇలా ఇలా ఉన్నాయి.

 

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ యువకుడితో సంబంధం పెట్టుకున్న బాలికను ఆమె తల్లిదండ్రులే పురుగుల మందు తాగి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు. కాగా ఈ నెల 14న బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.మృతురాలు తండ్రి రెడ్డి రాజు తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదు చేశాడు. అయితే ఈ ఆత్మహత్యపై పోలీసులుకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచారణ జరపగా.. పేరెంట్స్ హత్య చేసినట్టు తేలింది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram