గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి మూడోవారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగానే ముగించాలని నిర్ణయించిన ప్రభుత్వం
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని మినహాయించనున్న ప్రభుత్వం
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండోవారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్న ఎన్నికల కమిషన్
Post Views: 37









