గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / సోమవారం నిర్వహించిన శీతాకాలం అసెంబ్లీ సమావేశంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు బస్ స్టేషన్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. గత 35 సంవత్సరాల క్రితం మణుగూరు మండలంలో నిర్మించిన ఆర్టీసీ బస్సు స్టేషన్ మరియు ఆర్టీసీ బస్సు డిపో శిథిలావస్థలో ఉందని, దీని కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులకు పడుతున్నారని, బస్ స్టేషన్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని సంబంధిత మంత్రికి కి స్పీకర్ ద్వారా విన్నవించుకున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూమల సమస్య తీవ్రంగా ఉందని పోడు రైతులకు పరిష్కారం చూపాలని ఫారెస్ట్ అధికారుల నుంచి గిరిజనులకు విముక్తి కలిగించాలని అసెంబ్లీ సమావేశంలో కోరిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.
Post Views: 29









