తిరుమలకు పోటెత్తిన భక్తులు

గోల్డెన్ న్యూస్ /తిరుమల / కలియుగ దైవం శ్రీవారిని వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఓవైపు వైకుంఠ ఏకాదశి, మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా తరలివచ్చారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులుతీరి ఉన్నాయి. గరుడ సర్కిల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ ఏకాదశికి టోకెన్లు లేకపోయినప్పటికీ కొత్త ఏడాదిలో తిరుమలలో గడపాలని భక్తులు సుదూరప్రాంతాల నుంచి తరలివచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram