కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

ఐదుగురు వ్యక్తుల అరెస్టు

గోల్డెన్ న్యూస్ / మణుగూరు  / కోడి పందాలు స్థావరం పై  పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని కమలాపురం గ్రామ పరిసరాల్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో మణుగూరు పోలీసులు ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6,600 రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం ఒక కోడి మరియు కోడి పందాలకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ నాగబాబు వెల్లడించారు. పట్టుబడిన ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram