మనవడితో కలిసి నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించారు.
ములుగు జిల్లా మేడారంలో వనదేవతల మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

Post Views: 62









