ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చైన్ మ్యాన్ గా నిర్వహిస్తున్న రాజమళ్ళ బుచ్చి రాములు (55) అనారోగ్యంతో తన పొలం వద్ద నీటిలో పడి  సోమవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల తహసీల్దార్ కాంతారావు.ఆర్ఐ పోలెబోయిన కృష్ణ ప్రసాద్ తోటి వీఆర్ఎలు సంతాపం తెలిపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram