గంజాయి ముఠా బరితెగింపు.. మహిళా కానిస్టేబుల్‌పై కారు దూసుకెళ్లిన నిందితులు.
నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా బరితెగించింది. నిర్మల్‌కు చెందిన గంజాయి ముఠా కారులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారును ఆపేందుకు మహిళా కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించగా, ముఠా సభ్యులు కారుతో ఆమెను ఢీకొట్టారు. ఈ ఘటనలో సౌమ్యకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై గంజాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని, అందులోని గంజాయిని సీజ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తూ, బాధిత కానిస్టేబుల్‌కు పూర్తి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ముఠా









