ప్రమాదకరంగా మేడిగడ్డ బ్యారేజ్

మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

గోల్డెన్ న్యూస్  /వెబ్ డెస్క్/ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.లోక్ సభలో దేశవ్యాప్తంగా డ్యామ్ ల సేఫ్టీ పై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.దేశంలో మూడు డ్యాములు కేట గిరి-1లో ప్రమాదకరంగా ఉన్నాయి . తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ సహా యూపీలోని లోయర్ కజూరి డాం,బొకారో బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నాయి .ఈ డ్యాముల వల్ల రిస్క్ పొంచి ఉంది .సేఫ్ ఆపరేషన్స్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని.

మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించి రిస్క్ తగ్గించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది ఈ బ్యారేజ్‌కు కేంద్రం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు పేర్కొంది. ఇలాగే కొనసాగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని,  వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram