అవధులు లేని సంతోషం.. దివ్యాంగుడు హ్యాపీ హ్యాపీ..

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తి కికృత్రిమ కాలు అమరిక అవధులు లేని సంతోషం.. 

దాతలు శ్రీనివాసరావు, కస్తూరి దంపతులకు,మహర్షి స్వచ్ఛంద సంస్థ కు ధన్యవాదాలు ముదురుకొళ్ల సారంగపాణి.

మరింత మంది దాతలు ముందుకు వస్తే సేవ చేస్తా

మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం /  రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది… గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో ఎడమ కాలు ను కోల్పోయిన ఆ వ్యక్తి అచేతనంగా మారిన  కరకగూడెం మండలం గోళ్లగూడెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు ముదురుకొళ్ల సారంగపాణి 2019లో జరిగిన రోడ్డు ప్రమాదం లో తన ఎడమ కాలు కోల్పోయాడు. ఆ నాటి నుంచి కాలు లేక ఇబ్బంది పడుతున్నారు.  విషయం తెలుసుకున్న మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు బాధిత వ్యక్తి ని పరామర్శించారు.సారంగపాణి దుస్థితి దాతల దృష్టి కి తీసుకవేళ్ళారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయవాడకు చెందిన దాతలు శ్రీనివాసరావు, కస్తూరి దంపతులు సారంగపాణి కి కికృత్రిమ కాలు అమరిక కు ఆర్ధిక సహాయం అందించారు.కాగా జున్ను నాగరాజు అనే వ్యక్తి సహాయం తో ,విజయవాడలో ని ఇవోల్యూషన్ సెంటర్ లో

మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సారంగపాణి ఎడమ కాలుకు కృత్రిమ కాలు అమర్చారు. ఈ సందర్భంగా దాతలకు, మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకు వస్తే మరింతమంది నిరుపేదలకు సేవ చేస్తానని మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram