మేడారం జాతరలో .. ఆ రెండింటికే రూ.400 కోట్లు!

 

గోల్డెన్ న్యూస్/ ములుగు /  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ముగిసింది. గత నాలుగు రోజులుగా గద్దెలపై కొలువై నిలువెత్తు బంగారంతో భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మలు గద్దెలను వీడి వన ప్రవేశం చేశారు.

నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. కోటిన్నర మంది భక్తులు హాజరుకాగా, 14 లక్షల మేకలు, గొర్రెలను బలిచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క మద్యం కోసమే రూ.10 కోట్లు, మాంసం-మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. వీటితో పాటు కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం విక్రయాలు జరిగాయి.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram