పట్టా లేని రైతులకు యూరియా అందించే పరిష్కారం ఎన్నడూ ?
ఎన్నడూ లేని యూరియా కొరతను నివారించాలి
సిపిఎం డిమాండ్
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / రైతులకు యూరియా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సంవత్సరం ఎన్నడూ లేని యూరియా కొరత పెరిగిందని ఫలితంగా వ్యవసాయంలో పంటల దిగుబడి తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడంలో పట్టాదారులకు, కౌలుదారులకు మాత్రమే యూరియా పంపిణీ చేయడం అంటే పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులకు యూరియా ఏ విధంగా అందిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు ఆన్లైన్ వినియోగం చాలా తక్కువ అని ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులే అధికంగా ఉన్నారని వారు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలని వారన్నారు ప్రస్తుత వ్యవసాయ సాగులో ముందు తరం పెద్దలు ముసలివారు ప్రధమంగా వ్యవసాయం సాగు చేస్తున్నారని వారిలో చాలామందికి చదివే సక్రమంగా రానప్పటికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అంటే తీవ్ర గందరగోళానికి లోనవడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి కొరతను నివారించేలా యూరియా దిగుమతులు పెంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం పాల్గొన్నారు









