ఇందిరమ్మ ఇళ్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే  

 

గోల్డెన్ న్యూస్ /మణుగూరు  /మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు సొంత ఇల్లు కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. లబ్ధిదారులు పెనమకూరు వెంకటరమణకి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, రామారావు, ఆర్ఐ గోపి, ఎంపీవో వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ సంతోష్, పంచాయతీ సెక్రెటరీ, మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, గుట్ట మల్లారం సర్పంచ్ కారం పూజిత, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram