మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఏడూళ్లు బయ్యారం సిఐ వెంకటేశ్వర్రావు.

 గోల్డెన్ న్యూస్  /కరకగూడెం / యువత డ్రగ్స్ కు దూరంగా  ఉండాలని ఏడూళ్లు బయ్యారం సిఐ వెంకటేశ్వర్రావు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలని ఆయన  కోరారు.గురువారం కరకగూడెం, అనంతరం గ్రామాల్లో  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులు కలిసి ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యాంటీ  డ్రగ్స్ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..  ‘గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్య మవుతుంది. గంజాయిని తరిమిక్టొడానికి సమష్టి ప్రయత్నం కొనసాగించాలి’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలు  విక్రయించడం కాదు, సేవించడం కూడా నేరమే ఉన్నారు అన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 1908 -112- నెంబర్  కాల్ చేసి తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ ఎస్ఐ రవి ప్రసాద్ , కరకగూడెం ఎస్ఐ పీవీఎం రావు, ఎంఈఓ మంజుల పంచాయితీ అధికారులు, ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram